జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో కీలక ఆధారంగా భావించిన కుటుంబ పెంపుడు కుక్క మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో మరో విషాదకర పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్క ఇటీవల తిరిగి ఇంటికి చేరుకుంది.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ కుక్క ప్రవర్తనను కీలక ఆధారంగా భావించారు. అయితే అనారోగ్యానికి గురైన ఆ కుక్క చికిత్స పొందుతూ మృతి చెందింది.
దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి.