ఈ ధోరణిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పలాసలో భారీ ఎత్తున యాదవ సంఘాల ఆధ్వర్యంలో జగన్‌, సీదిరి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో యాదవ సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొనడంతో మరణించిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించాయి.

ప్రమాద ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని యాదవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొనడంతో పలాసలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.