'వైసీపీ హిట్ అండ్ రన్ పార్టీ' అంటూ వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో గతంలో పాదయాత్ర సమయంలో చేసిన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటిస్తూ, ఆ హత్యకు జగన్‌నే బాధ్యుడని తాను అప్పుడూ చెప్పానని, ఇప్పటికీ అదే మాట చెబుతున్నానని లోకేశ్ అన్నారు.

వైసీపీని 'హిట్ అండ్ రన్ పార్టీ'గా అభివర్ణించిన ఆయన, మాజీ మంత్రి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమైన ఘటనను ప్రస్తావించారు. ఒక కేంద్రమంత్రి తన కుమారుడు తప్పు చేసిన వెంటనే చట్టానికి లొంగిపోయేలా చేశారని, అయితే వైసీపీ నేతల విషయంలో అలాంటి చర్యలు కనిపించలేదని విమర్శించారు.

గతంలో జగన్ కాన్వాయ్‌కు సంబంధించిన ఘటనలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలను వైసీపీ నాయకత్వం చిన్న విషయాలుగా చూస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు.