జులై 23కు వాయిదా.. సస్పెండెడ్ సీఐ నాగరాజుకు వారం గడువు
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఎదుట జరిగిన విచారణలో కేసును జులై 23వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సస్పెండెడ్ సీఐ నాగరాజుకు సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.
నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ జులై 23న జరగనుంది.