శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నివాసానికి చేరుకోనున్న జనసేన అధినేత

ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయన, డిశ్చార్జ్ అయిన వెంటనే నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోనున్నారు.