అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన మాజీ ముఖ్యమంత్రి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై ఘన నివాళులర్పించారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం ముగిసిన అనంతరం జగ్గంపేట మీదుగా రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్, ముద్రగడ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం శోకసంద్రంలో ఉన్న ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంతిమయాత్రలో పాల్గొన్న జగన్, స్వయంగా పాడె మోసి తన నివాళిని అర్పించారు.