పెంపుడు శునకం విశ్వాసానికి నివాళి.. సోషల్ మీడియాలో వైరల్

యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన 'డుగ్గు' అనే పెంపుడు కుక్కకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రదీప్ జైన్‌ను ఖననం చేసిన అదే స్మశానవాటికలో, ఆయన సమాధి పక్కనే డుగ్గును పూర్తి గౌరవంతో ఖననం చేశారు.

యజమాని, పెంపుడు శునకం మధ్య ఉన్న అపూర్వమైన అనుబంధాన్ని చూసి అంత్యక్రియలకు హాజరైనవారు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుండగా, జంతువుల విశ్వాసం, ప్రేమపై నెటిజన్లు హృదయాన్ని హత్తుకునే వ్యాఖ్యలు చేస్తున్నారు.