పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటి బల్క్ వినియోగదారులు ఇకపై సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయరాదని కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలు, పెద్ద వాణిజ్య సంస్థలు, ఇతర బల్క్ వినియోగదారులు ఇకపై సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయకూడదని ఆదేశించింది.
ఇకపై బల్క్ వినియోగదారులు ప్రత్యేక బల్క్ సరఫరా వ్యవస్థ ద్వారానే డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సామాన్య వినియోగదారులకు ఇంధన సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భారీ వినియోగదారులు రిటైల్ బంకుల నుంచే ఎక్కువ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడంతో సరఫరాపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగింది.