టీవీకేలో చేరి తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో పోటీ చేస్తారన్న ప్రచారంపై రాఘవ లారెన్స్ స్పందించారు. త్వరలో కీలక ప్రకటన చేస్తానని చెప్పడంతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడులో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం విజయ్ ప్రాతినిధ్యం వహించిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరిగే నేపథ్యంలో, టీవీకే తరఫున లారెన్స్ పోటీ చేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంపై స్పందించిన లారెన్స్, ప్రస్తుతం "బెంజ్" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, జూన్ 11న కీలక ప్రకటన చేస్తానని తెలిపారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై మరింత ఆసక్తి పెరిగింది.
విజయ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే పరిశీలిస్తాననే సంకేతాలను కూడా లారెన్స్ ఇచ్చినట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.