బతుకమ్మకుంట భూమి వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పాటించకుండా వివాదాస్పద స్థలంలో చేపట్టిన చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
బతుకమ్మకుంట భూమి వివాదానికి సంబంధించిన కేసులో గతంలో యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్కడ పనులు చేపట్టినట్లు గుర్తించిన కోర్టు, దీనిని తీవ్రంగా పరిగణించింది.
అంతేకాకుండా వివాదాస్పద ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్డులు, ఇతర నిర్మాణాలను తొలగించి పాత స్థితిని పునరుద్ధరించాలని కూడా ఆదేశించింది.