సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని షర్మిల విమర్శించారు. రెండేళ్ల పాలనలో ప్రచారం ఎక్కువ, పాలన తక్కువగా ఉందని ఆరోపించారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు Y. S. Sharmila కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
రెండేళ్ల కూటమి పాలన "అప్పులు ఫుల్లు... అభివృద్ధి నిల్", "ప్రచారం పీక్స్... పాలన వీక్" అన్నట్లుగా సాగుతోందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగలేదని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని విమర్శించారు.
ప్రజలు అభివృద్ధి కోసం అధికారాన్ని అప్పగిస్తే, కూటమి ప్రభుత్వం గంపెడు హామీలు ఇచ్చి చిటికెడు మాత్రమే అమలు చేసిందని షర్మిల ఆరోపించారు. విజయోత్సవ సభలు నిర్వహించే ముందు ప్రభుత్వం తన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.