ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలను ప్రజలకు వివరించి అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఏలూరులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్, విద్యాబోధనతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.