సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలో పునఃప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
సింగరేణిలో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే పునఃప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యాజమాన్యాన్ని ఆదేశించారు. అర్హులైన కార్మికులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించి, వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు.
అలాగే, అర్హత సాధించిన 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.