జగన్ నిర్వహించిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం ప్రజలను రెచ్చగొట్టేందుకు చేసిన రాజకీయ డ్రామా అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దౌర్జన్యాలు, దాడులతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఎప్పటికీ వైసీపీకి అధికారం ఇవ్వబోరని హెచ్చరించారు.

వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం పూర్తిగా రాజకీయ డ్రామా అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గతంలో ప్రజలకు చేసిన అన్యాయాలను మరిపించేందుకే వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆరోపించారు.

వైసీపీ నేతలు ఇప్పటికీ తమ తప్పులను గుర్తించకుండా దౌర్జన్యాలు, దాడులతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం బలప్రదర్శన కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, కొన్ని చోట్ల పోలీసులపై దాడులకు కూడా వైసీపీ కార్యకర్తలు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ప్రజలను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదని, అసలైన ద్రోహి జగన్ేనని మనోహర్ విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో భాగమని, కానీ హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రజలు ఎప్పటికీ అధికారాన్ని అప్పగించరని హెచ్చరించారు.