ధార్మిక ప్రాజెక్టుల్లో పనిచేసే కళాకారులు, పండితులు, స్వామీజీలు, రుత్వికులకు పెరిగిన సంభావనలు.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ధార్మిక ప్రాజెక్టుల్లో సేవలందిస్తున్న కళాకారులు, పండితులు, స్వామీజీలు, రుత్వికులకు 18 ఏళ్ల తర్వాత గౌరవ వేతనాలను పెంచుతూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
వేతనాల సవరణ కోసం టీటీడీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వివిధ వర్గాల కళాకారులు, పండితులు, స్వామీజీలు, రుత్వికులకు అందిస్తున్న సంభావనలను సమీక్షించింది. కమిటీ చేసిన సిఫార్సులను టీటీడీ బోర్డు ఇటీవల ఆమోదించింది. ఈ నిర్ణయంతో ధార్మిక సేవలందిస్తున్న వేలాది మంది కళాకారులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.