నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. పెళ్లికి రూ.5 కోట్లు ఖర్చు చేసినా అదనపు కట్నం కోరారని, భర్త శారీరక లోపం, కుటుంబం మతం మారిన విషయాన్ని దాచారని ఫిర్యాదు.
వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు. 2025 మే 28న వివాహం జరిగినప్పటి నుంచి తనకు తీవ్ర వేధింపులు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
షాలిని మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరిందని, పెళ్లికి తమ కుటుంబం రూ.5 కోట్లు ఖర్చు చేసి, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇతర కానుకలు ఇచ్చినా.. మరో రూ.5 కోట్లు, ఫార్చూనర్ కారు తీసుకురావాలని వేధించారని ఆరోపించారు.
భర్త రాజీవ్‌కు ఉన్న శారీరక లోపాన్ని దాచిపెట్టి వివాహం చేశారని, కుటుంబం మతం మారిన విషయాన్ని కూడా తమకు తెలియకుండా ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో పూజలు చేస్తే అవమానించేవారని, అగరబత్తులు వెలిగించినా అభ్యంతరం చెప్పేవారని ఆరోపించారు.