10వ తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య కేసు.. ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోటో దిగిన మూడు రోజులకే శివాని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఆదేశాల మేరకు ఎఫ్‌ఎస్‌ఎల్, క్లూస్ టీమ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించాయి.

శివాని రాసిన సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు, ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.