దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితా వెల్లడైంది.
నివేదిక ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రూ.648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.3,660 కోట్లుగా నివేదిక పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. అత్యల్ప ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.